ఉదయం నిద్రలేవగానే మనం చేసే పనులు రోజు మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. చాలామందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇవి తాగడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనికి బదులుగా గోరు వెచ్చని నీళ్లు తాగడం మంచిదట. అలాగే నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడటం వల్ల రోజంతా అప్సెట్ అవుతుందట. అలా కాకుండా ఉదయాన్నే వాకింగ్ లేదా వ్యాయామం చేయడం వల్ల రోజంతా చురుగ్గా ఉండేందుకు దోహదపడతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.