కొత్త ఏడాది రెండో టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశే ఎదురైంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ నుంచి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 47 నిమిషాల మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ శ్రీకాంత్ 22-24, 13-21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యి (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు.
ఈ టోర్నీకి ముందు మలేషియా ఓపెన్‌లో ఆడిన శ్రీకాంత్ రెండో రౌండ్లోనే ఓడిపోయాడు. మరోవైపు పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21-15, 19-21, 21-16తో ఫాంగ్ చి లి-ఫాంగ్ జెన్లీ (చైనీస్ తైపీ)పై గెలిచింది. 78 నిమిషాల్లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.