ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

business |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2024, 12:26 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 362 పాయింట్లు నష్టపోయి 71,138 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు తగ్గి 21,451 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.15 దగ్గర ప్రారంభమైంది. టాటా మోటార్స్‌, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com