అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో ప్రతిష్టాత్మక ట్రోఫీకి సిద్ధమైంది. సౌతాఫ్రికా వేదికగా శుక్రవారం (జనవరి 19) నుంచి అండర్-19 వరల్డ్ కప్ ఆరంభం కానుంది.
ఈ మెగా టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. భారత్ తన తొలి మ్యాచ్ ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఆ తర్వాత 25న ఐర్లాండ్, 28న యూఎస్‌తో తలపడనుంది.