దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శనివారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 71806 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 21,662 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా.. హిందుస్థాన్ యునిలివర్ నష్టాల్లో కొనసాగుతోంది. అయితే, సోమవారం సెలవు నేపథ్యంలో సూచీలు శనివారం పనిచేస్తున్నాయి.