తమలపాకుల వల్ల అనేక ఆరోగ్య లాభాలున్నాయి. ఆకలి అనిపించనప్పుడు, నోటికి రుచి లేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉంటే తమలపాకులు తినడం మంచిది. తలనొప్పి, మైగ్రైన్ కి తమలపాకులు దివ్య ఔషధంలా ఉపయోగపడతాయి. రోజూ తమలపాకులు తీసుకుంటే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణ ప్రక్రియకు మెరుగుదలకు తమలపాకులు బాగా పనిచేస్తాయి.