సాంబారు కమ్మటి వాసన రావాలంటే చిటికెడు ఇంగువ పొడి పడాల్సిందే. పప్పులో కూడా కాస్త ఇంగువను వేసుకుంటే వంటిల్లు ఘుమఘుమలాడిపోతుంది. అయితే ఈ ఇంగువ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.
ఫెరులా అని పిలిచే మొక్క కాండం, వేర్ల నుంచి వచ్చే రసంతో ఈ ఇంగువను తయారు చేస్తారు. ఈ మొక్కలు ఒక రకమైన జిగురు లాంటి పదార్థాలను స్రవిస్తాయి. ఆ జిగురును సేకరిస్తే అవి గట్టిగా రాళ్లల్లా తయారవుతాయి. ఆ రాళ్ళను చూర్ణంలా మార్చి ఇంగువను తయారు చేస్తారు.