సాధారణంగా వారంలో రెండు సార్లు ఆకు కూరలు తీసుకుంటాం. కానీ వాటిలో బతువా ఆకుకూర ఎవరికీ తెలీదు. బతువా ఆకుకూరలో విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
అలాగే నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు బరువును తగ్గిస్తాయి.
అంతేకాదు దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బతువా ఆకుల్లో జింక్, అమైనో యాసిడ్స్, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయపడతాయి.