దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ 505 పాయింట్లు పుంజుకొని 71,929 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 141 పాయింట్లు పెరిగి 21,712 దగ్గర కొనసాగుతోంది. ICICI బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎయిర్టెల్, NTPC, బజాజ్ ఫిన్సర్వ్, సన్‌ఫార్మా, విప్రో, ఇన్ఫోసిస్, AXIS బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.