వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కానీ, ఇంటిని నిర్మించేటప్పుడు మెట్లను కూడా మంచి దిశలోనే నిర్మించుకోవాలి. లేకుంటే తిప్పలు తప్పవు. ఈశాన్య, ఆగ్నేయ దిశలో మెట్లను నిర్మిస్తే ఆరోగ్య, ఆర్థిక సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం మెట్లని ఎప్పుడు బేసి సంఖ్యలో నిర్మించుకోవాలి. మెట్ల కింద ఖాళీ ప్రదేశాన్ని ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.