తమ దేశంలోని అమెజాన్ ఫ్యాక్టరీలపై $34.9 మిలియన్ల జరిమానా విధించినట్లు ఫ్రాన్స్ డాటా ప్రొటెక్షన్ ఏజెన్సీ వెల్లడించింది. ఉద్యోగులపై మితిమీరిన నిఘా ఉంచడమే ఇందుకు కారణంగా ఏజెన్సీ తెలిపింది.
ప్యాకేజీలను ప్రాసెస్ చేసే స్కానర్ల సహాయంతో అమెజాన్ తన ఉద్యోగులపై నిఘా ఉంచిందని, 10 నిమిషాలకు మించి స్కానర్ యాక్టివ్‌లో లేకపోతే వెంటనే మేనేజ్మెంట్కు తెలిసిపోయేలా నిఘాను ఏర్పాటు చేసినట్లు ఏజెన్సీ ప్రకటించింది.