హిమోగ్లోబిన్ అనేది మన రక్తంలో కనిపించే ప్రోటీన్. ఇది మన శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. మన శరీర కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందాలంటే హిమోగ్లోబిన్ స్థాయిలు సాధారణంగా ఉండాలి.
మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో సగటున 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 ఏళ్లలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 నుంచి 12ఏళ్లలోపు పిల్లల్లో12 గ్రాములు ఉండాలి.