ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయిన భారత్‌

sports |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2024, 10:22 AM

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ప్రారంభంలోనే టీమిండియాకు షాక్‌ తగిలింది. భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (74 బంతుల్లో 80, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ను ఇంగ్లండ్‌ పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ జో రూట్‌ ఔట్‌ చేశాడు. రూట్‌ వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికి జైస్వాల్‌ అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 29 ఓవర్లలో భారత్‌ 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com