మధుమేహం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ గా మారిపోయింది. వయసు సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్య బారినపడుతున్నారు. ఎక్కువ మందికి తమకు షుగర్ వచ్చిందనే విషయం చాలా ఆలస్యంగా తెలుసుకుంటూ ఉంటారట. దీని లక్షణాలు మనకు 30ఏళ్లు దాటిన తర్వాతి నుంచే మొదలౌతాయట. దాహం సమస్య, ఆకస్మిక బరువు పెరగడం, చర్మంపై మచ్చలు, కంటి చూపు సమస్యలు, దురద, పొడి చర్మ సమస్య, చేతులు , కాళ్ళలో తిమ్మిరి లాంటి లక్షణాలుంటే షుగర్ వచ్చినట్లే అని నిపుణులు చెబుతున్నారు.