అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ అమ్మకాల సెగతో కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 71,831 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు కుంగి 21,712 దగ్గర కొనసాగుతోంది. ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్, టైటన్, ఐటీసీ, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.