ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘‘మేక్ ఇన్ ఇండియా’ మన నినాదం అని పేర్కొన్నారు. ‘‘శతాబ్దాలుగా కలలు కంటున్న అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైంది. ఎన్నో ఆటంకాలను అధిగమించి ఆలయాన్ని ప్రారంభించాం’’ అని చెప్పారు.
దేశంలో 5జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ నినాదంతో ముందుకెళ్తున్నాం. రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. యూపీ, తమిళనాడులో రక్షణ కారిడార్లు ఏర్పాటయ్యాయి’’ అని పేర్కొన్నారు.