కండలు పెంచాలని వ్యాయామం చేసేవారు రోజూ తినేదాని కన్నా కాస్త ఎక్కువ ఆహారం తినాలి. అది కూడా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అయితే చాలామందికి మజిల్స్ పెరగాలంటే కేవలం నాన్ వెజ్ మాత్రమే తినాలనే అపోహ ఉంటుంది. కానీ దాంతో పాటు బాదం, వాల్నట్స్ తీసుకుంటే శరీరానికి అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను అందిస్తాయి. సోయా ప్రోడక్ట్స్, పాలు, పాల ఉత్పత్తులు, క్వినోవా వంటివి కూడా వ్యాయామం చేసేవారికి బాగా ఉపయోగపడుతాయి.