కాళ్లకు వచ్చే నల్ల మచ్చల సమస్యను స్ట్రాబెర్రీ లెగ్ అంటారు. ఈ సమస్య వల్ల జట్టు రంధ్రాల దగ్గర వాపు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య పరిష్కారమవ్వడానికి షేవ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎపిలేటర్‌ను ఉపయోగించడం వల్ల స్కిన్ ఎలర్జీ రాదు. నల్లటి మచ్చలు ఉన్నచోట బేకింగ్ సోడాను రాయండి. లేదా అర బకెట్ నీటిలో బేకింగ్ సోడా కలిసి అందులో కాళ్లను ముంచాలి. కొద్ది సేపటి తర్వాత కాళ్లను బయటికి తీసి కడగాలి.
సర్వరోగాలకు కారణం: మారుతున్న జీవన శైలి వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఎక్కువగా తలెత్తే ఆరోగ్య సమస్యలు ఉప్పు, చక్కెరను అధిక శాతం ఆహారంగా తీసుకోవడం వలన వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ , థైరాయిడ్, బీపీ, అల్సర్, ఆస్తమా వంటి రోగాలకు ప్రధాన కారణాలు చక్కర, ఉప్పు మాత్రమేనని అంటున్నారు. అటు ఆయుర్వేద వైద్యులు కూడా వీటిని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదని చెబుతున్నారు