నేపాల్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ మూడు వికెట్లను కోల్పోయింది. అండర్-19 ప్రపంచకప్ సూపర్ సిక్స్ లో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది భారత్. యువ ఆటగాడు ఆదర్ష్ సింగ్ 21(18), అర్షిన్ కులకర్ణి 18(30) అవుట్ అయ్యారు. ప్రియాన్షు మోలియా 19(36) రన్ అవుటై వెనుతిరిగాడు. నేపాల్ బౌలర్లు గుల్సన్ ఝా, ఆకాష్ చంద్ చెరొక వికెట్లను తీసుకున్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 18 ఓవర్లకు 80/3.