మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచాలి. నానబెట్టిన మెంతులను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనికి చిక్కటి పెరుగును జోడించి జుట్టు మరియు మాడుకు పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును నీటితో బాగా కడగాలి. ఇది చుండ్రు మరియు ఇతర స్కాల్ప్ చికాకులను నివారిస్తుంది. అంతేకాక, శరీరవేడిని కూడా ఈ ప్యాక్ నివారిస్తుంది.
మెంతి గింజలతో చుండ్రు, జుట్టు రాలడం, బట్టతల మరియు ఇతర జుట్టు సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు. మెంతుల్లో ఉండే లెసిథిన్ దెబ్బతిన్న జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.