అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ నేడు కీలక మ్యాచ్ ఆడనుంది. సెమీఫైనల్లో భాగంగా ఆతిథ్య సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఓటమే ఎరుగని భారత్ సూపర్ సిక్స్ లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్ కు చేరింది. అయితే సొంతగడ్డపై సౌతాఫ్రికాను ఢీకొననుంది. మరి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ ఏం చేస్తుందో చూడాలి. మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఇండియా 11: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (సి), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, అరవెల్లి అవనీష్ (వికె), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, రాజ్ లింబాని, సౌమీ పాండే.
దక్షిణాఫ్రికా 11: లువాన్-డ్రే ప్రిటోరియస్ (వారం), స్టీవ్ స్టోక్, డేవిడ్ టీగర్, రిచర్డ్ సెలెట్స్వానే, దేవాన్ మరైస్, రొమాషన్ పిలే, జువాన్ జేమ్స్ (సి), రిలే నార్టన్, ట్రిస్టన్ లూస్, న్కోబానీ మోకోయెనా, క్వేనా మఫాకా