మొబైల్ టారిఫ్‌లు మరింత పెరగవచ్చని భారతి ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ సంకేతాలిచ్చారు. కంపెనీ ఆర్ధిక ఫలితాల సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో.. కంపెనీ పెట్టుబడులపై రాబడి ఇంకా కనిష్ఠంగా 9.4 శాతమే ఉందని,
పరిశ్రమ ఆరోగ్యకంగా ఉండాలంటే టారిఫ్‌ల పెంపు కీలకమని వివరించారు. డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 54 శాతం వృద్ధి చెంది రూ.2,442 కోట్లకు చేరింది.