వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అలెన్‌ను శాండ్టన్ సన్ హోటల్ వద్ద కొందరు దుండగులు దాడి చేసేందుకు యత్నించారు. గన్‌తో బెదిరించి అతడి దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకుని వెళ్లారు. అయితే ఈ సంఘటనపై పార్ల్ రాయల్స్ జట్టు ఇంకా స్పందించలేదు.
సౌతాఫ్రికా టీ20 లీగ్ కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న అలెన్‌ను కొందరు దుండగులు తుపాకీతో బెదిరించి, అతడి సెల్ ఫోన్, వ్యక్తిగత వస్తువులను ఎత్తుకెళ్లారు. జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రఖ్యాత శాండ్టన్ సన్ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ విషయం క్రీడావర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో క్రీడాకారుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.