పేటీఎం వాలెట్ వ్యాపారాన్ని కొనుగోలు చేయనున్నట్లు వస్తున్న వార్తల్ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఖండించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. నిబంధనల ప్రకారం.. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తామే స్వయంగా వెల్లడిస్తామని చెప్పింది. పేటీఎం సైతం తాము ఎవరితోనూ వ్యాపార అమ్మకాల నిమిత్తం చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది.
పీపీబీఎల్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29, 2024 నుండి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించింది. వినియోగదారు ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ (NCMC) కార్డ్‌లు మొదలైన వాటిలో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్‌లు లేవు. వీటి ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. PPBL కార్యకలాపాలపై బాహ్య ఆడిటర్లు ఇచ్చిన నివేదిక. సంస్థ కొన్ని నిబంధనలను ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలున్నట్లు ఆడిట్ లో తేలడంతో ఆ సంస్థపై తదుపరి పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని వెల్లడైంది.