గూగుల్ కంపెనీ సీఈఓ 'సుందర్ పిచాయ్' రోజు.. ఒక వెబ్సైట్ చూడటంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. పిచాయ్ ప్రతిరోజూ నిద్ర లేవగానే 'టెక్మీమ్' అనే వెబ్సైట్లో లేటెస్ట్ టెక్ న్యూస్ చదవడంతో ప్రారంభమవుతుందని సమాచారం.
టెక్మీమ్ అనే వెబ్సైట్ 2005లో గేబ్ రివెరా స్థాపించారు. ఇందులో చిన్న సారాంశాలతో సేకరించిన హెడ్లైన్స్ ఉంటాయి. ఇందులో ఎలాంటి యాడ్స్ లేకుండా కీలక అంశాలను త్వరగా చూసేయొచ్చు.