జెర్సీ నంబర్ 7తో మహేంద్రసింగ్ ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన దీనిపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'నన్ను 7వ తేదీనే కనాలని మా అమ్మానాన్న నిర్ణయించుకున్నారు.
1981లో జూన్ 7న నేను జన్మించాను. ఆ ఏడాది కూడా గమ్మత్తుగా ఉంది. 8 లోంచి ఒకటి తీసేస్తే.. ఏడు వస్తుంది. అలా ఏడో నంబర్ నా జీవితంలో అంతర్భాగం. ఆ జెర్సీని అందుకే ఎంచుకున్నా' అని ధోనీ తెలిపారు.