ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5 రోజుల్లో రూ.2.18 లక్షల కోట్లు..ఎల్ఐసీ, ఎస్‌బీఐకి భారీ లాభాలు

business |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2024, 11:13 PM

దేశంలోని అత్యంత విలువైన టాప్-10 కంపెనీల్లో ఈ నాలుగు కంపెనీలు అదరగొట్టాయి. 4 కంపెనీల మార్కెట్ విలువ గత వారం ట్రేడింగ్‌లో మొత్తంగా 5 రోజుల్లోనే రూ.2.18 లక్షల కోట్లు పెరిగింది. అందూలోనూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక లాభాలు అందుకుని టాప్‌లో నిలిచాయి. అలాగే టాప్ -10 అత్యంత విలువైన కంపెనీల్లో చూసుకుంటే.. ఈ 4 కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ భారీ లాభాలు అందుకున్నాయి. ఈ నాలుగు కంపెనీలు కలిపి మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారంలో రూ.2,18,598.29 కోట్లు పెరిగింది.


మరోవైపు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్తాన్ యూనిలివర్, ఐటీసీ సంస్థల మార్కెట్ విలువలో భారీ కోత పడింది. ఈ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకోవడంతో మొత్తంగా ఈ 6 కంపెనీల మార్కెట్ విలువ రూ. 1,06,631.39 కోట్లు కోసుకుపోయింది. గత వారం బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ ఏకంగా 490.14 పాయింట్లు అంటే 0.67 శాతం మేర నష్టపోయింది.


ఒక్కో కంపెనీ పరంగా చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 86,146.47 కోట్ల పెరిగి రూ. 6,83,637.38 కోట్లకు పెరిగింది. అలాగే ఎల్ఐసీ షేరు ధర గత సోమవారం సుమారు 6 శాతానికిపైగా పెరిగి తొలిసారి రూ.1000 మార్క్ ను తాకింది. మరోవైపు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారంలో రూ. 65,908.26 కోట్లు పెరిగి రూ. 6,46,365.02 కోట్లకు చేరింది. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 61,435.47 కోట్లు పెరిగి రూ. 15,12,743.31 కోట్లకు పెరిగింది. టీసీఎస్ షేర్లు గత మంగళవారం 4 శాతం పెరిగాయి. దీంతో మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లు దాటింది. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ గత వారంలో రూ. 5,108.09 కోట్లు పెరిగి మొత్తంగా రూ. 19,77,136.54 కోట్లకు ఎగబాకింది.


మరోవైపు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 32,963.94 కోట్లు నష్టపోయి రూ. 10,65,808.71 కోట్లకు తగ్గింది. అలాగే ఐటీసీ మార్కెట్ వాల్యూ రూ. 30,698.62 కోట్లు కోసుకపోయి రూ. 5,18,632.02 కోట్లకు తగ్గింది. భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ విలువ గత వారం రూ. 16,132.15 కోట్లు తగ్గి రూ. 6,31,044.50 కోట్లకు దిగివచ్చింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ గత వారం రూ. 10,044.09 కోట్లు పడిపోయి రూ. 6,92, 980.35 కోట్లకు తగ్గింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com