రంజీ ట్రోఫీ కీర్తి ప్రతిష్టలు మసకబారుతున్నాయని భారత మాజీ ఆటగాడు మనోజ్ తివారీ అన్నారు. ’’దేశవాళీ క్రికెట్లో సత్తా చాటితే జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని యువ క్రికెటర్లకు మాజీలు సలహా ఇస్తుంటారు.
అయితే అక్కడ చాలా విషయాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ టోర్నీ కాపాడుకోవాలంటే వాటిపై దృష్టిసారించి సరిచేయాల్సిన అవసరం ఉంది‘‘ అని తివారీ సంచలన ఆరోపణలు చేశారు.