ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్పెషలిస్ట్ స్పిన్నర్ జాక్ లీచ్ భారత్‌తో చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. వేలికి గాయం కారణంగా రెండో టెస్టులోనే బెంచ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సిరీస్ నుంచే వైదొలిగాడు. అతడి స్థానంలో ఎవరినీ తీసుకోవడం లేదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్‌తోపాటు జో రూట్ సేవలను వినియోగించుకుంటామని తెలిపింది.