ప్రముఖ స్పోర్ట్స్వేర్ తయారీ సంస్థ 'నైకీ' తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలోని 2 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం ఆ సంస్థలో 83,700 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. భవిష్యత్ విక్రయాలు ఆశించినంత ఉండకపోవచ్చని, ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ వివరించింది. రెండు దశల్లో ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది.