రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య మూడో టెస్ట్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మూడో రోజు శనివారం ఆటలో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం జరిగింది. భారత మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించినట్లు బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. దత్తాజీ రావు గైక్వాడ్ భారత్ తరఫున 11 టెస్టు మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు.