టెస్టు మూడో రోజు భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో ఇంగ్లండ్ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే జో రూట్ (18)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ప్రమాదకరమైన జానీ బెయిర్‌స్టో (0), ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (153)లను కుల్దీప్ యాదవ్ అవుట్ చేసి భారత్‌ను పోటీలో నిలిపాడు.
ప్రస్తుతం కెప్టెన్ బెన్ స్టోక్స్ (39 నాటౌట్), వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (6 నాటౌట్) ఆడుతున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు పరుగులు జోడించారు. దీంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ 290 పరుగులు చేసింది. స్టోక్స్ జట్టు ఇంకా 155 పరుగులు వెనుకబడి ఉంది.