ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి బుగ్గన ఇంటి ముట్టడికి NSUI యత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2024, 12:38 PM

నంద్యాల జిల్లా డోన్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు యత్నించారు. ‘దగా డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు.
25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com