దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 85 పాయింట్లు లాభపడి 72,512 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకొని 22,085 దగ్గర కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఐటీసీ, సన్‌ఫార్మా, రిలయన్స్, మారుతీ, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.