రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు సోమవారం ముగిశాయి. ఎలైట్ విభాగంలో, మొత్తం 32 జట్లను 4 గ్రూపులుగా విభజించారు (ఎ, బి, సి, డి). గ్రూప్ 'బి'లో ముంబై జట్టు 37 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... ఆంధ్ర జట్టు 26 పాయింట్లతో (3 విజయాలు, 3 డ్రాలు, 1 ఓటమి) రెండో స్థానంలో నిలిచింది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌కు ముందే ఈ రెండు జట్లకు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి.
గ్రూప్ 'ఎ' నుండి విదర్భ (33 పాయింట్లు), సౌరాష్ట్ర (28 పాయింట్లు) ... గ్రూప్ 'సి' నుండి తమిళనాడు (28 పాయింట్లు), కర్ణాటక (27 పాయింట్లు) ... గ్రూప్ 'డి' మధ్యప్రదేశ్ (32 పాయింట్లు) నుండి , బరోడా (26 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. హైదరాబాద్ ఎలైట్ విభాగానికి అర్హత సాధించింది కాగా, 32 జట్లలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన మణిపూర్, గోవాలు తర్వాతి సీజన్లో ‘ప్లేట్’ విభాగంలోకి దిగజారాయి.