అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 72,432 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు కుంగి 21,993 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.95 వద్ద ప్రారంభమైంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.