గత ఏడాది వన్డే ప్రపంచ కప్ సిరీస్ లో టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన విషయం తెలిసిందే.! ప్రస్తుతం హార్దిక్ గాయం నుండి కోలుకుని క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.
డీవై పాటిల్ టీ20 కప్ లో రిలయన్స్ వన్ జట్టు తరఫున బరిలో దిగాడు. బీపీసీఎల్ తో జరిగిన మ్యాచ్ లో మూడు ఓవర్లు వేసిన హార్దిక్ రెండు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో 3 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.