సరికొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లతో థార్ ఎర్త్ ఎడిషన్‌ను మహీంద్రా ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో, కావాల్సిన యాక్సెసరీస్‌తో ఈ కార్లను కొనుగోలు చేసుకోవచ్చు.
ప్రారంభ ధర రూ.15.40లక్షలు (ఎక్స్‌షోరూమ్ ధర). ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ)ధర రూ.15.40లక్షలు కాగా, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఏటీ)వేరియంట్ రూ.16.99లక్షలుగా ఉంది. డీజిల్ ఎంటీ ధర రూ.16.15లక్షలు కాగా, ఏటీ ధర రూ.17.40లక్షలుగా ఉంది.