ఇప్పటికే ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా చివరి టెస్టులో పలు మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. విరామం లేకుండా ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి, 100వ టెస్టు ఆడనున్న అశ్విన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఓపెనింగ్ కు రోహిత్ స్థానంలో పడిక్కల్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో అశ్విన్, జడేజా తప్పితే భారత్ దాదాపు కుర్రాళ్ల జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.
ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా – ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు.. మార్చి 07 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.ఇక ఇంగ్లాండ్తో జరగబోయే ఐదవ టెస్టులో టీమ్ ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడికి మేనేజ్మెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. రజత్ పాటీదార్ స్థానంలో పడిక్కల్ ఆడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.