స్టాక్ మార్కెట్లు సెలవు రోజు అయినా శనివారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సైట్లలో స్పెషల్ ట్రేడింగ్ జరిగింది. డిజాస్టర్ రికవరీ సైట్ పనితీరును సమీక్షించేందుకు ఈ స్పెషల్ ట్రేడింగ్‌ను నిర్వహించాయి. ఇందులో భాగంగా మొదటి ట్రేడింగ్ సెషన్ ఎన్ఎస్ఈ, 2వ సెషన్ స్టాక్ ఎక్స్‌ఛేంజీకి సంబంధించిన రికవరీ సైట్లో నిర్వహించారు. ప్రధాన సైట్‌కు అవాంతరాలు తలెత్తితే ట్రేడింగ్ అంతరాయం ఏర్పడకుండా ఎక్స్‌ఛేంజీలు ఈ డిజాస్టర్ సైట్ను నిర్వహిస్తుంటాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం నిర్వహించిన రెండు స్పెషల్ ట్రేండింగ్ సెషన్లో భారీ లాభాలను ప్రదర్శించాయి. సెన్సెక్స్ 58 పాయింట్లు లాభపడి 73,804 వద్ద ముగిసింది. నిఫ్టీ 39 పాయింట్లు వృద్ధి చెంది 22,419కు చేరి ఆల్ టైమ్ హై రికార్డును నమోదు చేసింది. ఇక టాటా స్టీల్, టాటా మోటార్స్, విప్రో, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, ఎస్బీఐ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.