వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో కివీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన లియాన్ కివీస్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నాథన్ నిలిచాడు.