దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 73,717 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు కుంగి 22,355 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.