ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT-DSC) నిర్వహణపై ప్రభుత్వం అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తోంది. ప్రధానంగా డీఎస్సీ తేదీలు, పరీక్షా కేంద్రాలపై స్పష్టత కరవైంది.
టెట్‌కు డీఎస్సీకి మధ్య నాలుగు వారాల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించలేదు. కనీసం వెబ్సైట్లోనూ ఆ సమాచారం లేదు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.