మహాశివరాత్రి హిందువులకు ఎంతో ముఖ్యమైనది. పురాణాలలో ఈ పర్వదినాన్నీ శివపార్వతుల కళ్యాణ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. అలాగే ఈ రోజు శివుడు తన దివ్య తాండవమైన శివతాండవ నృత్యాన్ని ప్రదర్శిస్తాడని చెబుతారు.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో శివుడిని కొలుస్తారు. ముఖ్యంగా ఉపవాసం, రాత్రి జాగరణ, శివనామస్మరణతో అభిషేకాలు వంటి ప్రత్యేక పూజలు శివునికి చేస్తారు.