ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సింగిల్స్‌లో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. సింగిల్స్ మిగిలిన ఏకైక భారత ఆటగాడు లక్ష్యసేన్ సైతం సెమీస్‌లో ఓడి ఇంటిదారిపట్టారు. శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 22-20, 13-21, 11-21 తేడాతో థాయిలాండ్ షట్లర్ కున్లావుట్ విటిద్సర్న్ చేతిలో పరాజయం పాలయ్యారు.