దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్ 19 పాయింట్ల నష్టంతో 74,099 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 22,495 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.70 వద్ద ప్రారంభమైంది. బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, M&M, HCL టెక్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ITC, L&T షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.