అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. రషీద్ ఖాన్ ఆఫ్ఘన్ క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. భారతదేశంలో జరిగిన ODI ప్రపంచ కప్-2023 తర్వాత ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్ వెన్ను నొప్పి వల్ల సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్థాన్-ఐర్లాండ్ టీ20 సిరీస్లో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నట్లు రషీద్ ఖాన్ వెల్లడించాడు.