మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానుంది. అయితే, గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్య తిరిగి ముంబై ఇండియన్స్‌కు చేరుకున్నాడు. పాండ్య కెప్టెన్సీలో గుజరాత్ వరుసగా రెండుసార్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పాండ్య వెళ్లినా గుజరాత్‌కు నష్టం లేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. హార్దిక్ లేకున్నా టైటాన్స్ బలంగానే ఉందని పేర్కొన్నాడు.