ప్రముఖ టెలికాం సంస్థ జియో డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఎంట్రీకి సిద్దమైంది. దీంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.
ఇండియాలో 20 లక్షల మంది వ్యాపారులు UPI సౌండ్ బాక్సులు వినియోగిస్తుండగా అందులో 85% పేటీఎం కంపెనీవే ఉన్నాయి. ఈక్రమంలో Paytm స్థానంలో జియో సౌండ్ బాక్సులను రిప్లేస్ చేసేలా ప్రణాళికలు చేస్తోంది. అలాగే పేటీఎం, భారత్ పే, ఫోన్ పే కంటే తక్కువ నెలవారి రెంటుకు అందించే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.