ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ ను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల ఉద్యోగుల వేతనాలు కూడా పూర్తిగా చెల్లించలేకపోయింది. ఖర్చులను తగ్గించుకోవడానికి తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులను సైతం ఖాళీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
దాదాపు 15 వేల మంది ఉద్యోగులను పూర్తిగా ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బెంగళూరులోని ప్రధాన కార్యాలయం మాత్రమే పనిచేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.